రేపటి నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 24న వర్చువల్ ఈవెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రారంభించనున్నారు. ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఛార్జీల వివరాలు చూస్తే కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య చైర్ కార్ టికెట్‌కు రూ.1600, ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌కు రూ.2915 చెల్లించాలి. ఇందులోనే కేటరింగ్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.419 కాగా, చైర్ కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.364. యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి కాచిగూడ మధ్య ఛార్జీలు చూస్తే ఏసీ చైర్ కార్‌కు రూ.1540, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌కు రూ.2865 చెల్లించాలి. ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.369 కాగా, చైర్ కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.308. 20704 నెంబర్ గల కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు టైమింగ్స్ చూస్తే రైలు తెల్లవారుజామున 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరితే మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. 20704 నెంబర్ గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ జంక్షన్‌లో బయల్దేరితే రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు నగరాల మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటల్లో కవర్ చేస్తుంది. మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, ఢోన్, అనంతపూర్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు మధ్య నడుస్తున్న ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించడానికి కనీసం 12 గంటల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ రైలులో ఏడు చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటీవ్ కార్ కోచ్ ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)