భారత్ సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 September 2023

భారత్ సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంది !


భారతదేశం తన సొంత ఎజెండాను ప్రచారం చేయడానికి, చైనా ప్రయోజనాలకు భంగం కలిగించడానికి జీ20 అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ భారతదేశంలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. భారతదేశం భౌగోళిక రాజకీయ విషయాలను ప్రపంచవేదికపైకి తీసుకువస్తోందని ఆరోపించింది. జీ20 అతిథ్యదేశంగా తన బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా మరన్ని సమస్యలను సృష్టిస్తోందని పేర్కొంది. అంతకుముందు భారత్ జీ20 సమావేశాలను అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో నిర్వహించింది. ఈ రెండింటిని చైనా, పాకిస్తాన్ ఖండించాయి. చైనా అరుణాచల్ ప్రదేశ్ ని తన భూభాగంగా చెబుతోంది. ఇదిలా ఉంటే జీ20 సమావేశానికి కొన్ని రోజుల ముందు చైనా కొత్త మ్యాపులను రిలీజ్ చేసింది. దీంట్లో అరుణాచల్ ప్రదేశ్, లఖడ్ భూభాగాలను తనవిగా పేర్కొంది. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాల క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సమావేశాలకు హాజరుకాలేదు. ఆయన బదులుగా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరయ్యారు. తాజాగా ఈ చైనీస్ థింక్ ట్యాంక్ వ్యాఖ్యానిస్తూ..'' దౌత్యపరమైన, ప్రజాభిప్రాయాన్ని భారత్ గందరగోళ పరుస్తూ, వివాదాస్పద భూభాగాల్లో సమావేశాలను నిర్వహించి జీ 20 సమావేశ సహకార వాతావరణాన్ని దెబ్బతీసిందని, ఫలితాల సాధనకు ఆటంకం కలిగించింది'' అని ఆరోపించింది. 

No comments:

Post a Comment