ఆనంద్ మహీంద్రా డబుల్ డెక్కర్ బస్సు ట్వీట్పై స్పందించిన ముంబై పోలీసులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 September 2023

ఆనంద్ మహీంద్రా డబుల్ డెక్కర్ బస్సు ట్వీట్పై స్పందించిన ముంబై పోలీసులు !


తన చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకదానికి కోల్పోతున్నందుకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర భావోద్వేగానికి గురవుతూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ముంబై ఎరుపురంగు డబుల్ డెక్కర్ బస్సులకు గురించి ఆసక్తికర పోస్ట్ ను నెటిజన్లతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముంబైలో దాదాపు 80 యేళ్లుగా ప్రజలకు సర్వీస్ అందించిన ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులకు వీడ్కోలు పలకనున్న సమయంలో తాజా పోస్ట్ తో ఎమోషనల్ అయ్యాడు. 'హలో ముంబై పోలీస్, నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి దొంగలించబడుతోంది.. మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. అయితే ఆనంద్ మహీంద్ర పోస్ట్ ముంబై పోలీసులు స్పందించారు. ఆనంద్ మహీంద్రా ఫిర్యాదు అందుకున్నాము. అయితే దొంగతనం స్పష్టంగా కనబడుతుంది కానీ మేం దానిని రికవరీ చేయలేం. అది మీ హృదయంలో, ముంబై వాసులందరిలో భద్రపరచబడిందని'' ట్వీట్ చేశారు. ఓపెన్-డెక్ డబుల్ డెక్కర్ బస్సులు 1990 నుంచి నగర పర్యటనకు వచ్చిన వారికి సేవలందిస్తున్నాయి. 2008 నుంచి వాటి నిర్వహణ ను అధికారులు నిలిపివేశారు. తాజాగా ఈ బస్సులకు వీడ్కోలు పలకాలని అధికారులు నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లో ఇవి ముంబై రోడ్లపై కనిపించవు. ఏళ్ల తరబడి ప్రజలకు సేవ చేసిన ఈ బస్సులకు వీడ్కోలు పలికేందుకు బస్ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు సిద్దమయ్యారు. వీటిలో కొన్నింటిని మ్యూజియంలో ఉంచాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రి, బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్)కు ప్రయాణికులు లేఖలు కూడా రాశారు.

No comments:

Post a Comment