పాల డబ్బులు ఇవ్వలేదని పసిబిడ్డ తల్లిపై దాష్టీకం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 September 2023

పాల డబ్బులు ఇవ్వలేదని పసిబిడ్డ తల్లిపై దాష్టీకం !

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శిశువుకు పాల కోసం క్యాంటీన్‌కు వెళ్లిన మహిళను కొందరు వ్యక్తులు ఈడ్చి కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆగస్ట్‌ 13న తెల్లవారుజామున సాగర్‌ సిటీలోని బస్టాండ్‌ ఫుట్‌పాత్‌ వద్ద ఒక మహిళ తన బిడ్డతో ఉన్నది. శిశువును ఫుట్‌పాత్‌ వద్ద ఉంచి పాల కోసం బస్టాండ్‌ వద్ద ఉన్న క్యాంటీన్‌కు వెళ్లింది. పాలు కొన్న ఆ మహిళ డబ్బులు ఇవ్వడం మరిచిపోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను పక్కకు ఈడ్చారు. కాళ్లతో తన్ని, కర్రతో కొట్టారు. దీంతో తనను కొట్టవద్దంటూ ఆ మహిళ వారిని ప్రాధేయపడింది. అక్కడ గుమిగూడిన కొందరు జోక్యం చేసుకున్నారు. తన బిడ్డ ఫుట్‌పాత్‌ వద్ద ఉందని, పాల కోసం వచ్చినట్లు ఆ మహిళ చెప్పింది. దీంతో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శిశువును కొందరు గమనించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని శిశువును, మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేన్నట్లు తెలుసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై స్పందించారు. ఆ మహిళను ఈడ్చి కొట్టిన నిందితులను 26 ఏండ్ల ప్రవీణ్ రైక్వార్, 20 ఏండ్ల విక్కీ యాదవ్, 40 ఏండ్ల రాకేష్ ప్రజాపతిగా గుర్తించారు. గోపాల్‌గంజ్ పోలీసులు గురువారం ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జనమంతా చూస్తుండగా రోడ్డుపై నడిపించి తీసుకెళ్లారు. కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment