జిన్‌పింగ్‌, పుతిన్‌లు హాజరుకాకపోవడం ముఖ్యం కాదు !

Telugu Lo Computer
0


ఢిల్లీ వేదికగా సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగబోయే జీ-20 సదస్సు రష్యా, చైనా దేశాల అధ్యక్షులు రాకపోవడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ విలేకరుల సమావేశంలోమాట్లాడారు.  చైనా, రష్యా అధ్యక్షులు జిన్‌పింగ్‌, పుతిన్‌లు జీ20 సదస్సుకు హాజరుకావడం లేదని ఇప్పటికే ఆ దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. పేద, సంపన్న దేశాల కూటములుగా విడిపోతున్న సమయంలో వారధిగా వ్యవహరిస్తున్న భారత్‌పై దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ? అనే ప్రశ్నకు జైశంకర్‌ సమాధానం ఇచ్చారు. ''భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు కొందరు దేశాధినేతలు హాజరు కావడం లేదు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. వారి తరఫున వచ్చే ప్రతినిధులు ప్రపంచ రాజకీయాలకు తమవంతు సహకారం అందిస్తారు అని నమ్ముతున్నాం. ఏ దేశం నుంచి ఎవరు హాజరవుతారనే విషయం కంటే వచ్చిన దేశ ప్రతినిధులు ఆయా అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై దృష్టి కేంద్రీకరించడం ఎంతో మేలు'' అని అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)