సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 13 September 2023

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల


హైదరాబాద్ వేదికగా 16, 17వ తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం తలమునకలై ఉంది. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్​ను ఏఐసీసీ తాజాగా విడుదల చేసింది.16 తేదీన మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఇచ్చే లంచ్​కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు హోటల్ తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొననున్నారు. 18వ తేదీన ఎంపీలు మినహా మిగతా నేతలంతా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రజలకు 5 హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు అందజేయనున్నారు.

No comments:

Post a Comment