క్రీడా స్ఫూర్తిని చాటుకున్న టీమిండియా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 September 2023

క్రీడా స్ఫూర్తిని చాటుకున్న టీమిండియా !


సియాకప్‌ చరిత్రలో నేపాల్‌ తొలిసారి ఆడింది. ఈ టోర్నీలో నేపాల్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకపోయినప్పటికీ తమ అద్బుతమైన ఆటతీరుతో అందరిని అకట్టుకుంది. భారత్‌, పాకిస్తాన్‌ వంటి అగ్రశేణి జట్లపై నేపాల్‌ చూపిన పోరాట పటిమ మిగతా చిన్న జట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో సత్తాచాటిన నేపాల్‌, భారత్‌పై బ్యాటింగ్‌లో అదరగొట్టింది. షమీ, సిరాజ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లకు నేపాల్‌ బ్యాటర్లు ఆడిన తీరు ఎంత చెప్పుకున్న తక్కువే. నేపాల్‌ ఫైటింగ్‌ స్పిరిట్‌కు భారత జట్టు కూడా ఫిదా అయిపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం నేపాల్‌ డ్సెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి భారత ఆటగాళ్లు ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా నేపాల్‌ ఆటగాళ్లను మెడల్స్‌తో సత్కరించి టీమిండియా మరోసారి క్రీడా స్పూర్తిని చాటుకుంది.  ఈ క్రమంలో భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా నేపాల్‌ ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకున్నారు. భారత్‌ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం నేపాలీలలో ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా క్యాండీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

No comments:

Post a Comment