కేరళలోని దక్షిణాది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Telugu Lo Computer
0


కేరళలోని దక్షిణ జిల్లాలకు శుక్రవారం ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో వర్ష హెచ్చరిక జారీ చేశారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అంచనాలతో కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబరు 24, 25 తేదీల్లో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. 22వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు కేరళ తీరం వెంబడి 1.7 నుంచి 2.0 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జాతీయ సముద్ర, వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. 22వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దక్షిణ తమిళనాడు తీరం వెంబడి 1.6 నుంచి 2.0 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని జాతీయ సముద్ర, వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. మత్స్యకారులు, తీరప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)