మొరాకోలో భారీ భూకంపం

Telugu Lo Computer
0


మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 08వ తేదీ శుక్రవారం రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 296 మంది మరణించారు. 153 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నైరుతి మర్రాకేశ్​ ప్రాంతంలో భూమికి 18.5 కిలో మీటర్ల దిగువన భూకంపం నమోదైంది. అట్లాస్ పర్వతాలలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ అయిన ఔకైమెడెన్‌కు పశ్చిమాన 56.3 కిలోమీటర్లలో కేంద్రీకృతమైందని పేర్కొంది. పదుల సార్లు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్​ సర్వే ప్రకటించింది. మొరాకోలో భూకంపం ధాటికి భవనాలు పేకమేడలను తలపించాయి. ఎక్కడికక్కడ కూలిపోయాయి. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)