కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 మీటింగ్‌కు జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్ స్కల్జ్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 9 September 2023

కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 మీటింగ్‌కు జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్ స్కల్జ్‌ !


ర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్‌ ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు హాజరయ్యారు. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ఇవాళ ఆయనకు ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కల్జ్‌ తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై ఆ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత వారం జాగింగ్ చేస్తూ గాయపడినట్లు ప్రతినిధి తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిన్నది. స్వల్ప స్థాయిలో ఆయన కంటికి గాయాలయ్యాయని, మరికొన్ని రోజుల పాటు స్కల్జ్ ఆ బ్లాక్ కలర్ ఐ ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని ప్రతినిధి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్‌కు ఉన్నట్లు ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు.

No comments:

Post a Comment