నలుగురు పిల్లలను కాలువలో పడేసిన తల్లి - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

నలుగురు పిల్లలను కాలువలో పడేసిన తల్లి

తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన శరవంద, ఎర్రగుంట తండాకు చెందిన లలిత (33) ఎనిమిదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా వీరి సంసారంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కల్లు తెచ్చుకుంటానని భర్తను అడిగితే, అతను వద్దని చెప్పడంతో లలిత తీవ్ర మనస్తాపం చెందింది. భర్త బయటకు వెళ్లిన తర్వాత, అతను వేధిస్తున్నాడని చెప్పి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు పిల్లలతో కలిసి స్టేషన్‌కి వెళ్లింది. స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉండటంతో, ఆమెను కాసేపు వెయిట్‌ చేయమని స్టేషన్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత టిఫిన్‌ చేసి వస్తానని స్టేషన్‌లో చెప్పి, లలిత బయటకు వెళ్లింది. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వ దగ్గరికి వెళ్లి, తన నలుగురు పిల్లలను అందులో పడేసింది. ఆ తర్వాత లలిత కూడా దూకాలని ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న వారు పిల్లలను కాపాడేందుకు కాల్వలోకి దూకగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మహాలక్ష్మి (5), సాత్విక (4), మంజుల (3) మృతి చెందారు. బాబు మార్కండేయ (7 నెలలు) గల్లంతవ్వగా, ఆచూకీ ఇంకా లభించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment