ఉత్తరాఖండ్ మదర్సాలలో సంస్కృతం బోధన !

Telugu Lo Computer
0


త్తరాఖండ్ మదరసాలలో సంస్కృత భాష కూడా బోధించబడుతుంది అని ఆ  రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ ప్రకటించారు. మదర్సాలలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలు చేస్తామన్నారు. దీంట్లో భాగంగా మదర్సాలలో సంస్కృత భాష కూడా బోధించనున్నామని తెలిపారు. ఎపిజె అబ్దుల్ కలాం వంటి స్పూర్తిదాయకమైన వ్యక్తుల అడుగుజాడల్లో పిల్లలు నడవడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. పిల్లలను చదివించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి  హామీ ఇచ్చారని షాదాబ్ షామ్స్ తెలిపారు. మొత్తం 117 మదరసాలలో సంస్కృతంతో పాటు, ఇంగ్లీషు, అరబిక్ బోధిస్తామని, ఇస్లామిక్ అధ్యయనాల సమ్మేళనంగా ఉంటాయని తెలిపారు. ఈ విద్యావిధానం ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగూణంగా ఉంటుందని తెలిపారు. ఆధునిక విద్య అనేది ఈనాటి విద్యార్దులకు చాలా అవసరమన్నారు. ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునికత కలిగలిపిన విద్యను బోధిస్తామని తెలిపారు. ఇటువంటి విద్యతో మర్సాలలో చదువుకుంటున్న విద్యార్ధులకు చక్కటి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మదర్సాలలో కేవలం ఇస్లామిక్, అరబిక్ మాత్రమే బోధించేవారని ఇక నుంచి సంస్కృత భాషను కూడా బోధిస్తామని తెలిపారు. కాగా మదర్సాలలో ఇస్లామిక్ కు చెందిన విషయాలనే బోధించేవారనే విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)