కెనడాను భయపెడుతున్న 'గృహ సంక్షోభం' !

Telugu Lo Computer
0


కెనడాను 'గృహ సంక్షోభం' భయపెడుతుంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రూడో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా విమర్శలకు దిగారు. ట్రూడో 2025 వరకు కెనడా ప్రధానిగా ట్రూడో ఉండాలంటే జగ్మీత్ సింగ్ మద్దతు తప్పనిసరి. వలసదారులను స్వాగతించే దేశంగా పేరున్న కెనడా, ఈ హౌసింగ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితి విధించాలని యోచిస్తోందంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కెనడా వైశాల్యపరంగా చూస్తే రష్యా తరువాత ప్రపంచంలో అతిపెద్ద దేశం, కానీ జనాభా మాత్రం 3.87 కోట్లు మాత్రమే. చదరపు కిలోమీటర్ కి కేవలం నలుగురు మాత్రమే ఉంటున్నారు. అదే ఇండియాలో జనసాంద్రత 481గా ఉంది. కెనడాలో గృహ సంక్షోభానికి ప్రభుత్వం తగినన్ని ఇళ్లు నిర్మించకపోవడం కారణమని ఆ దేశ ఎంపీలు విమర్శిస్తున్నారు. కెనడా జనాభాలో 87 శాతం మంది 10 ప్రావిన్సుల్లో మాత్రమే స్థిరపడ్డారు. కెనడా దక్షిణ భాగంలో అమెరికా సరిహద్దును ఆనుకుని కేవలం 160 కిలోమీటర్ల లోపే 90 శాతం మంది నివసిస్తున్నారు. మిగతా భూభాగం మంచుతో కప్పబడి, ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉండటంతో ఆ ప్రాంతంలో జనాభా చాలా చాలా తక్కువ. కెనడాలో ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడంతో సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఈ సంక్షోభంపై కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే కూడా ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాలో ఇళ్లను సరసమైనవిగా చేస్తానని హామీ ఇచ్చిన 8 ఏళ్ల తరువాత ఖర్చును రెట్టింపు చేశారని ఆరోపించాడు. అద్దె, ఇళ్లకు డౌన్ పేమెంట్, మార్టిగేజ్ పేమెంట్ డబుల్ చేశాడని అన్నారు. కెనడా 1972లో కన్నా 2022లోనే తక్కువ ఇళ్లను నిర్మించిందని ఆరోపించారు. 2023లో ఇది 32 శాతం తగ్గుతాయని ఆయన అన్నారు. కెనడాలో గృహ సంక్షోభానికి అంతర్జాతీయ విద్యార్థులు కారణం కాదని, ట్రూడో ప్రభుత్వమే కారణమని జగ్మీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది కెనడా 9 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. ఇలా కెనడాకు వస్తున్న వారిలో భారతీయ విద్యార్థులే ఉన్నారు. 2022లో 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు వస్తే ఇందులో 2.26 లక్షలు అంటే 40 శాతం మంది భారత్ కి చెందిన వారే. వలసలు ఎక్కువగా ఉన్నాయి, కానీ అందుకు తగ్గట్లుగా ఇళ్ల నిర్మాణాలు లేవు. చాలా మంది నిరాశ్రయులు వీధుల్లో గుడారాల్లో జీవిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు భారతీయ విద్యార్థుల్ని డబ్బులు తెచ్చే వారిగా చూస్తున్నారు, కెనడియన్ల నుంచి వసూలు చేసేదాని కన్నా మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ఈ కాలేజీలకు హాస్టల్ సౌకర్యాలు కూడా లేవు. 2022లో కెనడాలో 8 లక్షల కంటే ఎక్కువ విదేశీ విద్యార్థులు హౌసింగ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)