బ్యాంక్ క్యాష్ వ్యాన్ పై కాల్పులు జరిపి 22 లక్షల దోపిడీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 12 September 2023

బ్యాంక్ క్యాష్ వ్యాన్ పై కాల్పులు జరిపి 22 లక్షల దోపిడీ !


త్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని ఓ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు ఓ సెక్యురిటీ గార్డు, ఇద్దరు క్యాషియర్లు ఓ వ్యాన్ లో వచ్చారు. ఏటీఎం ముందు నగదు వ్యాన్ ను నిలిపారు. వ్యాన్ వెనకాల సెక్యూరిటీ గార్డు భద్రతగా ఉన్నాడు. మరో ఇద్దరు వ్యాన్ లో నుంచి నగదు పెట్టెను తీసే పనిలో ఉన్నారు. అయితే అప్పటికే వీరిని హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి గమనిస్తున్నాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి సెక్యురిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. అతను కిందపడిపోయాడు. నగదు పెట్టె తీస్తున్న ఇద్దరిలో ఓ వ్యక్తి వ్యాన్ లోకి ఎక్కేసి కూర్చుంటాడు. మరో వ్యక్తి పారిపోతాడు. నిందితుల్లో వైట్ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి క్యాష్ పెట్టెను తీసుకెళ్లిపోతాడు. అప్పటికే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి..వీరందరిని భయపెడతాడు. ఈసమయంలో ఓ విద్యార్థి సైకిల్ పై వచ్చి అతన్ని చూసి అపుతాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఇతరుల సాయంతో సెక్యూరిటీ గార్డును లేపి ఆసుపత్రికి తరలిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దోపిడి నడి వీధిలో పట్టపగలు జరిగింది. అయినా కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. కారణం నిందితులు కాల్పులు జరపడమే. అయితే ఈ ఘటనలో గాయాలపాలైన సెక్యూరిటీ గార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గరికి గాయాలయ్యాయి.వారు ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నారు. 

No comments:

Post a Comment