ఇకపై జీ21 మారనుందా ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 September 2023

ఇకపై జీ21 మారనుందా ?


జీ20 కూటమిలో మరో యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌ కు సభ్యత్వం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఢిల్లీ వేదికగా ఈనెల 9,10 తేదీల్లో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత జీ20 పేరు మారుతుందని టాక్ నడుస్తోంది. జీ20 పేరును ఇకపై జీ21గా మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్నిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆఫ్రికా యూనియన్‌లో 55 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశానికి సంబంధించిన అంశం ఇప్పటికే జీ20 నివేదికలో చేర్చినట్లు తెలుస్తోంది. జూలైలో రష్యా-ఆఫ్రికా సమ్మిట్ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అభ్యర్థిత్వానికి G20 సమ్మిట్‌కు గైర్హాజరు అవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారని సమాచారం అందుతోంది. జీ20లో ప్రస్తుతం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. ఆయా దేశాలు కూడా జీ20లో ఆఫ్రికన్ యూనియన్ ని చేర్చే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. AU అంగీకారం తెలిపితే 27 మంది సభ్యుల యూరోపియన్ యూనియన్ అదే హోదాను కలిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత G20 పేరులో మార్పు వస్తుందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

No comments:

Post a Comment