ఎన్సీపీ చీఫ్‌గా అజిత్‌ పవార్‌ నియామకం చట్టవిరుద్ధం

Telugu Lo Computer
0


నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌గా అజిత్‌ పవార్‌ నియామకం చట్టవిరుద్ధమని శరద్‌ పవార్‌ వర్గం తెలిపింది. కొందరు ఎమ్మెల్యేల సంతకాల ఆధారంగా తనను తాను పార్టీ చీఫ్‌గా నియమించుకునేందుకు ఏకపక్షంగా ఆయన ప్రయత్నించినట్లు ఆరోపించింది. ఎన్సీపీ రాజ్యాంగం దీనికి అనుమతించదని పేర్కొంది. వివాదాస్పద తీర్మానంలో సంతకం చేసిన వారిలో నంబర్ 1గా అజిత్‌ పవార్‌ ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ)కి శరద్‌ పవార్‌ వర్గం వివరణ ఇచ్చింది. అలాగే ఎన్సీపీలో ఎలాంటి చీలిక లేదని స్పష్టం చేసింది. కాగా, ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివనేన రెబల్‌ వర్గం ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందన్న అజిత్‌ పవార్‌ వర్గం, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు పార్టీ సింబల్‌ కోసం ఈసీని ఆశ్రయించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీ కోరగా ఎన్సీపీ చీఫ్‌గా అజిత్ పవార్ నియామకం చట్టవిరుద్ధమని శరద్‌ పవార్‌ వర్గం జవాబిచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)