హర్యానాలోని నూహ్‌ పట్టణంలో కర్ఫ్యూ !

Telugu Lo Computer
0


ర్యానాలోని నూహ్‌ పట్టణంలో సోమవారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో ఈరోజు కర్ఫ్యూ విధించారు. వీహెచ్ పీ శోభాయాత్రపై కొందరి రాళ్ళ దాడితో మొదలైన ఈ అల్లర్లతో నూహ్ టౌన్ భగ్గుమంది. సోమవారం రాత్రి నాటికి ఈ గొడవల్లో ముగ్గురు చనిపోగా, పలువురు గాయాలపాలయ్యారు. కార్లు, ఇతర వాహనాలకు అల్లరి మూకలు నిప్పటించారు. ఈ ఉద్రిక్తతల నడుమ గురుగ్రామ్‌, నూహ్ లలో 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ హింసాకాండ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్ జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలను మంగళవారం మూసివేశారు. వీహెచ్ పీ శోభాయాత్రలో మోనూ మానేసర్ అనే వివాదాస్పద గో సంరక్షకుడు పాల్గొనడం వల్లే మరో వర్గానికి చెందిన వారు ఆగ్రహంతో రాళ్లదాడికి తెగబడ్డారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ఇప్పటికే నూహ్, గురుగ్రామ్‌లలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో నూహ్‌లో 1,000 మంది పోలీసులను మోహరించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)