ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు ఫ్లోర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ !

Telugu Lo Computer
0


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్ల మార్గం భక్తుల కోసం నరసింహస్వామి ఆలయం వద్ద నుండి రూ.4 కోట్లతో మోకాలి మిట్టవరకు షెల్టర్ నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల రింగ్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల కోసం రూ.2.24 కోట్లతో చార్జింగ్ స్టేషన్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది. అలాగే, రూ.24 కోట్లతో మొదటి ఘాట్లో రక్షణ గొడలు నిర్మాణం, రూ.4.50 కోట్లతో అన్నప్రసాదం భవనంలో వంట సామగ్రి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయంలో రూ.23 కోట్లతో వైకుంఠం కాంప్లెక్స్ తరహాలో క్యూలైన్ల ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి రూ.75.86 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. శ్రీనివాస సేతు వద్ద రూ.3 కోట్లతో సబ్ వే నిర్మాణం, రూ.3.10 కోట్లతో శ్రీనివాస మంగాపురం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస సేతు పనులకు రూ.118 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పనులు పూర్తి అయిన తరువాత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో నైవేద్యం ప్రసాదాల తయారీ కోసం టీటీడీ డైరీలో నెయ్యి ప్లాంట్ రూ.4.50 కోట్లు, టీటీడీ 69 ఆస్తులకు ఫెన్సింగ్ కోసం రూ.1.69 కోట్లు కేటాయింపు, రూ.11.50 కోట్లతో  ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు ఫ్లోర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2.20 కోట్లతో టీబీ వార్డు నిర్మించాలని నిర్ణయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)