మధ్యప్రదేశ్‌లో దళిత వ్యక్తిని కొట్టి చంపారు !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో దళిత యువతిపై లైంగిక వేధింపులకు సంబంధించి 2019లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని ఒక కుటుంబాన్ని కొందరు వ్యక్తులు బెదిరించారు. గురువారం అగ్రవర్ణాలకు చెందిన 9 మంది వ్యక్తులు ఆ ఇంటికి వెళ్లి హంగామా చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత బస్టాండ్‌ వద్ద ఉన్న 18 ఏండ్ల నితిన్ అహిర్వార్‌ వద్దకు వెళ్లారు. అతడి సోదరి ఫిర్యాదు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. నిరాకరించిన అతడ్ని దారుణంగా కొట్టి చంపారు. ఇంతలో యువకుడి తల్లి పరుగున అక్కడకు చేరుకున్నది. కుమారుడ్ని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆ వ్యక్తులు ఆమెను కూడా కొట్టారు. అలాగే ఆమె దుస్తులను లాగేశారు. అత్యాచారం చేస్తామని ఆమె కుమార్తెను బెదిరించడంతో భయంతో ఆమె పారిపోయింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు విక్రమ్ సింగ్ ఠాకూర్‌తో సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు కలకలం రేపిన ఈ సంఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ, ఆ ప్రభుత్వ ద్వంద స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే కూడా దళిత యువకుడి హత్యను ఖండించారు. మధ్యప్రదేశ్‌ను దళిత వివక్ష ప్రయోగశాలగా బీజేపీ మార్చిందని దుయ్యబట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)