కుక్కలను చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో మూటకట్టారు !

Telugu Lo Computer
0

                                                           

బెంగళూరులో మూగజీవాలపై మనుషుల అకృత్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్- హోసకరెహళ్లి మధ్య నిర్మానుష్య ప్రాంతంలో సంచిలో ఏడు వీధికుక్కల మృత దేహాలు ఒకేసారి లభ్యం కావడంతో స్థానికులు హడలిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు వీది కుక్కలను చంపి వాటి మృతదేహాలను సంచిలో నింపి నిర్జన ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాజరాజేశ్వరినగర్‌కు చెందిన వన్యప్రాణుల సంరక్షణ చూస్తున్న లీనా అనే మహిళ ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. లీనా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఏడు కుక్కల మృతదేహాలు కనిపించాయి. కుక్కల మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేద, విచారణ జరుపుతున్నామని రాజరాజేశ్వరి నగర పోలీసు అధికారులు అంటున్నారు. వీది కుక్కల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతే వీది కుక్కల మృతికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. దుండగులు వీధికుక్కలకు విషపూరితమైన ఆహారం తినిపించి చంపి సంచిలో నింపి నిర్జన ప్రాంతంలో పడేసి ఉంటారని చెబుతున్నారు. రాజరాజేశ్వరి నగర్‌లో గత వారం రోజులుగా 18 వీధికుక్కలు అదృశ్యమైనట్లు జంతు సంరక్షణ బృందం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వీది కుక్కల కారణంగా ఆ ప్రాంతంలోని చిన్నారులు, ముసలాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమయంలో ఈ స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ఏం చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో ఓ బృందం సభ్యులు నిర్జన ప్రాంతంలో ఏడు కుక్కల మృతదేహాలను గుర్తించారు. ఐదు కుక్కల మృతదేహాలు దాదాపుగా కుళ్లిపోయినట్లు గుర్తించారు. మూగ జంతువులపై జరిగిన క్రూరత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని వాళ్లు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)