కోట్లు కొల్లగొట్టిన కంపెనీ హెచ్ఆర్ !

Telugu Lo Computer
0


ఢిల్లీకి చెందిన మాన్ పవర్ గ్రూప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో మోసం బయటపడటానికి చాలా సమయం పట్టింది. కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రాధాభల్లవ్ నిరుద్యోగియైన తన భార్య పేరును ఎలాగోలా తన కంపెనీ పే రోల్ లో చేర్చాడు. దీంతో ఆమెకు కూడా కంపెనీలోని మిగతా ఉద్యోగుల్లాగానే నెలవారీ జీతం అకౌంట్ లో జమయ్యేది. కంపెనీకి వెండర్ కు మధ్య వారధిలా ఉండే హెచ్ఆర్ ఫైనాన్స్ మేనేజర్ పాత్రలో రాధా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ తంతు మొత్తాన్ని జాగ్రత్తగా నడిపించాడు. మొదటగా ఉద్యోగుల జీతభత్యాల వివరాల్లో తన భార్య పేరును ఎక్సెల్ షీటులో చేర్చి వెండర్ కు పంపేవాడు. వెండర్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను పైపైన చూసి సంతకం చేసి తిరిగి పంపేవాడు. అటుపై ఈ ఫైలును రాధా తన డైరెక్టర్ కు, ఆయన ఆమోదించిన తర్వాత చివరిగా చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారికి పంపి ఆఖర్లో తాను సంతకం చేసి అకౌంట్స్ కు పంపేవాడు. అకౌంట్స్ వారు యధాప్రకారమే జీతాలు చెల్లించేవారు. ఇలా పదేళ్ల పాటు సాగిన దందాలో కంపెనీకి సుమారు రూ.4 కోట్లు వరకు నష్టం వాటిల్లింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు బయటపడటంతో కంపెనీ యాజమాన్య నివ్వెరపోయింది. రాధాభల్లవ్ నాథ్ చేసిన నిర్వాకానికి విస్తుపోయిన కంపెనీ వెంటనే పోలీసు కంప్లైంటు ఇచ్చి అతడిని కటకటాల వెనక్కు పంపించారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)