హోమియోపతి మందులు - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


హోమియోపతి ద్వారా సమస్య తగ్గడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ, వ్యాధిని పూర్తిగా మూలాల నుంచి నిర్మూలిస్తుంది. అల్లోపతిలో కూడా తగ్గని కొన్ని వ్యాధులు హోమియోపతిలో తగ్గడం విశేషం. అయితే, ఇందుకు నియమాలు సరిగ్గా పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే ఈ ఔషధం వెంటనే ప్రభావం చూపుతుంది. మద్యపానం, గుట్కా, ధూమపానం చేయని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే వ్యక్తులపై హోమియోపతి ప్రభావం త్వరగా కనిపిస్తుంది. దీని ఫలితం కూడా మంచిగా వస్తుంది. అయితే, హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా కొన్ని నియామాలు పాటించాలి. వాటిని పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. ఆ మెడిసిన్స్ ఎన్ని వాడినా ఉపయోగం ఉండదు.

హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు తీసుకోవల్సిన జాగ్రత్తలు :  ఈ ఔషధం తీసుకున్న తరువాత కంటైనర్లు గట్టిగా మూసివేయాలి. హోమియోపతి వైద్యాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. ఎప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. వేడి ప్రదేశంలో ఉంచితే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలకు దరంగా ఉంచాలి. మెడిసిన్ బాటిల్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచొద్దు. హోమియోపతి మందులను ఎప్పుడూ చేతిలోకి తీసుకుని వేసుకోవద్దు. మూత ద్వారా మాత్రమే నోట్లో వేసుకోవాలి. ఔషధం తీసుకున్న 10 నిమిషాల వరకు ఏమీ తినొద్దు, తాగొద్దు. హోమియోపతి మందులు తీసుకుంటే కాఫీ, టీ తాగొద్దు. పుల్లటి ఆహారాలు తినొద్దు.


Post a Comment

0Comments

Post a Comment (0)