స్వాతంత్ర్య దినోత్సవాల్లో ముఖ్య అథితి కుర్చీ ఖాళీ !

Telugu Lo Computer
0


77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10వ సారి చారిత్రాత్మకమైన ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే తాను హాజరు కాలేదు కానీ, ఆయన తరపున ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సందేశం పంపారు. అందులో దేశ మాజీ ప్రధానులు సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఎర్రకోట ముందు అతిథుల కోసం ఉంచిన కుర్చీల్లో ఒకదానిపై మల్లికార్జున్ ఖర్గే పేరు రాసి ఖాళీగా ఉండిపోయింది. ఆయన గైర్హాజరీపై కాంగ్రెస్‌ వివరణ ఇస్తూ.. ఖర్గే ‘ఆరోగ్యం బాగాలేదు’ అని పేర్కొంది. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ ప్రధానుల గొప్పతనాన్ని అందులో హైలైట్ చేశారు. ప్రధానిగా ఉన్న భాజపా కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి కూడా అందులో ప్రస్తావించడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి “ప్రతి ప్రధానమంత్రి దేశ పురోగతికి తోడ్పడ్డారు. ఈ రోజు కొంతమంది భారతదేశం గత కొన్నేళ్లుగా మాత్రమే అభివృద్ధిని చూసిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు” అని చురకలు అంటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధానమంత్రులందరూ దేశం గురించి ఆలోచించి అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారని.. నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి బాధగా ఉందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు.. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల దాడులు చేయడమే కాకుండా ఎన్నికల కమిషన్‌ను కూడా నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష ఎంపీల నోరు మూయించడం, సస్పెండ్ చేయడం, మైక్‌లు ఆఫ్ చేయడం, ప్రసంగాలు చేయడం వంటివి జరుగుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య మంత్రాలలో ఒకటైన భారతదేశం స్వావలంబన.. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ విధానాలు దోహదపడ్డాయని అన్నారు. ''మహానేతలు కొత్త చరిత్ర సృష్టించేందుకు గత చరిత్రను చెరిపేయరు. కానీ కొందరు ప్రతిదానికీ పేరు మార్చేందుకు ప్రయత్నిస్తారు. గత పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేర్లను మార్చి, తమ నియంతృత్వ పద్ధతులను ఉపయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పాత చట్టాల పేర్లను మారుస్తున్నారు. మొదట ‘అచ్ఛే దిన్’, ఆ తర్వాత ‘నయా భారత్’, ఇప్పుడు ‘అమృత్ కాల్’ అన్నారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పేర్లు మార్చుకోవడం లేదా?'' అంటూ ప్రధాని మోడీపై మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)