బీబీఎంపీ ఆఫీసులో అగ్నిప్రమాదం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 11 August 2023

బీబీఎంపీ ఆఫీసులో అగ్నిప్రమాదం !


ర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలల కావస్తోంది. గత బీజేపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తో పాటు మంత్రులు పదేపదే చెబుతున్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలో బీజేపీ హయాంలో కొన్ని వేల రూపాయల పనులు జరిగాయి. బీబీఎంపీ పరిధిలో రోడ్లు, డ్రైనేజ్ లు, సిమెంట్ రోడ్లతో పాటు వేల కోట్ల రూపాయల పనులు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవనీతి జరిగిందని, బీజేపీలోని పెద్దలు కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్ వసూలు చేశారని, ఈ అక్రమాలపై రిటైడ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నామని శుక్రవారం సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడిన కొన్ని గంటల్లోనే బెంగళూరు నగరంలోని కార్పోరేషన్ సర్కిల్ లోని బీబీఎంపీ ప్రధాన కార్యాలయం ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించడం కలకలం రేపింది. బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలోని క్వాలిటి సెల్ విభాగంలోని కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురికి గాయాలైనట్లు సమాచారం. బీబీఎంపీ కార్యాలయ ఆవరణలోని క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన లేబొరేటరీ, కార్యాలయ భవనంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చెలరేగి అరగంట గడిచినా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని బీబీఎంపీ సిబ్బంది వాపోయారు. గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసుల ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనలో వేల కోట్ల వ్యాపార పత్రాలన్నీ దగ్ధమైనట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అర్దగంట పాటు నిరంతరాయంగా శ్రమించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ అగ్నిప్రమాదం విషయంలో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు చేస్తున్నామని హలసూర్ గేట్ పోలీసు అధికారులు తెలిపారు. బీబీఎంపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

No comments:

Post a Comment