హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి !

Telugu Lo Computer
0


ర్నాటక ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం అన్ని వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు ఉండాల్సిందే. అన్ని వెహికల్స్‌కు ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం చూస్తే..ఈ కొత్త నంబర్ ప్లేటు రూల్స్ నవంబర్ 17 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కొత్త రూల్స్‌కు సంబంధించి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 17 తర్వాత వెహికల్స్‌కు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు లేకపోతే మాత్రం భారీ జరిమానా పడుతుంది. రూల్స్ అతిక్రమిస్తే.. రూ. 500 నుంచి రూ. 1000 వరకు జరిమానా పడుతుంది. అంతేకాకుండా కొంత మంది స్టైలిస్ నెంబర్ ప్లేట్స్ కూడా వాడుతూ ఉంటారు. అలాంటి వారు ఉంటే.. కచ్చితంగా వాటిని తొలగించి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు వేసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులకు చలానా చెల్లించుకోవాల్సి వస్తుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉంటాయి. వీటికి పర్మనెంట్ ఐడెంటిపికేషన్ నెంబర్, క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్ వంటివి ఉంటాయి. వర్చువల్‌గా వీటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. అన్న వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఒకేలా ఉండాలనే లక్ష్యంలో స్టాండర్డైజేషన్ లక్ష్యంగా ఈ కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఒకరు తెలియజేసినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వెహికల్స్‌కు కూడా ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ ఉండాలని ప్రభుత్వం పేర్కొంటోంది. దాదాపు 2 కోట్ల వరకు వాహనాలు 2019 ఏప్రిల్ కన్నా ముందు రిజిస్టర్ అయ్యి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇంకా పాత వెహికల్స్‌కు కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ వేసుకోవాలని డిపార్ట్‌మెంట్ పేర్కొంటోంది.వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్‌కు చెందిన డీలర్ల వద్దకు వెళ్లి ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ కొనుగోల చేయొచ్చు. కార్లకు అయితే రూ.400 నుంచి రూ.500 వరకు, టూవీలర్లకు అయితే రూ. 250 నుంచి రూ.300 ఖర్చు చేస్తే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ రూల్స్ అమలులో ఉన్నాయి. రోడ్ సేఫ్టీ, వెహికల్ క్రైమ్స్ నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ రూల్‌ను అమలు చేస్తోంది. కాగా రోడ్ ట్యాక్స్ చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వెహికల్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేని వెహికల్స్‌కు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు వేసుకోవడం కుదరదు. ఇకపోతే బెంగళూరు సహా పలు కర్నాటక ప్రాంతాల్లో తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల అలాంటి వారు కూడా వారి వెహికల్స్‌కు ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

Post a Comment

0Comments

Post a Comment (0)