చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0

మిళనాడులోని నీలగిరి పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ మోడిస్ చాక్లెట్ కథనాన్ని చెప్పారు. 70 మంది మహిళల బృందంతో ఊటీలోని ప్రసిద్ధ చాక్లెట్ ఫ్యాకర్టీ నడుస్తుందని తెలిపారు. మోడిస్ చాక్లెట్ల కథ భారతదేశం యొక్క సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గొప్ప సామర్థ్యానికి ఒక గొప్ప సాక్ష్యం అని రాహుల్ చెప్పారు. రాహుల్ షేర్ చేసిన వీడియోలో ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వారితో కలిసి చాక్లెట్ తయారీలో రాహుల్ నిమగ్నమయ్యారు. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీపై ఎంత జీఎస్టీ విధిస్తారని రాహుల్ ఫ్యాక్టరీ యజమాన్యాన్ని ప్రశ్నించారు. 18శాతం జీఎస్టీ కట్టడం జరుగుతుందని తెలుసుకున్న రాహుల్ ఇది యావత్ దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. అనంతరం ఓ చిన్నారి నుంచి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.



Post a Comment

0Comments

Post a Comment (0)