పోలీస్ స్టేషన్ ముందే ప్రియురాలని హత్య చేసిన ప్రియుడు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 August 2023

పోలీస్ స్టేషన్ ముందే ప్రియురాలని హత్య చేసిన ప్రియుడు


ర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళలోని అళికే గ్రామంలో గౌరి (26) అనే యువతి నివాసం ఉంటున్నది. పుత్తూరులోని ఓ బట్టల షోరూమ్ లో గౌరి ఉద్యోగం చేస్తున్నది. పుత్తూరులో నివాసం ఉంటున్న పద్మరాజ్ (30) అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం గౌరికి పరిచయం అయ్యాడు. తరువాత గౌరి, పద్మరాజ్ స్నేహితులుగా ఉన్నారు. రానురాను పద్మరాజ్, గౌరీల స్నేహం ప్రేమగా మారింది. ప్రేమికులు గౌరి, పద్మరాజ్ ఇంతకాలం సినిమాలు, షికార్లు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల గౌరి ఆమె ప్రియుడు పద్మరాజ్ తో సరిగా మాట్లాడటం లేదని, ఫోన్ కాల్స్ రిసీవ్ చెయ్యడం లేదని తెలిసింది. ఇదే విషయంలో గౌరి, పద్మరాజ్ ల మధ్య గొడవలు మొదలైనాయి. గౌరి ఆమె పని చేస్తున్న బట్టల షోరూమ్ లోనే పని చేస్తున్న యువకుడితో ఎక్కువ చనువుగా ఉంటున్నదని, అందుకే తనను దూరం పెడుతోందని పద్మరాజ్ కు అనుమానం వచ్చింది. ఇదే విషయంలో ఇప్పటికే ఇద్దరి మద్య గొడవలు జరిగాయి. గురువారం మద్యాహ్నం పుత్తూరు బస్ స్టాండ్ సమీపంలో ఉన్న గౌరితో పద్మరాజ్ గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ సమయంలో గౌరి ఆమె ప్రియుడు పద్మరాజ్ మీద ఫిర్యాదు చెయ్యడానికి పుత్తూరులోని మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే గౌరిని అడ్డగించిన పద్మరాజ్ మళ్లి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగిపోవడంతో ముందుగా జోబులో పెట్టుకుని వెళ్లిన కత్తి బయటకు తీసిన పద్మరాజ్ అతని ప్రియురాలు గౌరి గొంతులో నాలుగుసార్లు చకచకా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలైన గౌరికి పుత్తూరులోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి తరువాత మెరుగైన చికిత్స కోసం మంగళూరుకు తరలించారు. మంగళూరుకు తరలించే సమయానికే గౌరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. గౌరిని కిరాతకంగా హత్య చేసిన పద్మరాజ్ ను కొన్ని గంటల్లోనే అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ప్రియురాలు గౌరి మీద అనుమానంతోనే పద్మరాజ్ ఆమెను హత్య చేశాడని, కేసు విచారణలో ఉందని పుత్తూరు పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment