అసైన్డ్ భూములపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 4 August 2023

అసైన్డ్ భూములపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం !


ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎకరాల భూముల్ని గతంలో బలహీన వర్గాలకు అసైన్డ్ భూముల రూపంలో ప్రభుత్వాలు కేటాయించాయి. వీటిలో ఇళ్లు కట్టుకోవడానికి లేదా ఇతరత్రా అవసరాలకు వాడుకోవడానికే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు. దీంతో వారు అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి కూడా తెస్తున్నారు. దీంతో తాజాగా ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1977 నాటి భూ బదలాయింపు చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. రాష్ట్రంలో కనీసం 20 ఏళ్ల క్రితం పంచిన అసైన్డ్ భూముల్ని అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఇందులో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న అసైన్డ్ భూములకు వాటిని తీసుకున్న వారికి యాజమాన్య హక్కులు వస్తాయి. దీంతో వాటి యజమానులు సదరు అసైన్డ్ భూములు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆర్డినెన్స్ విడుదల చేశారు. అయితే ఇలా అమ్ముకునే భూముల విషయంలో ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. అసైన్డ్ భూముల పక్కన వ్యవసాయేతర భూములు ఉండి, వాటి మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటే మాత్రం కొనుగోలుదారు ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్ధలాల్ని సైతం పదేళ్ల తర్వాత అమ్ముకునే అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో ప్రస్తావించింది.

No comments:

Post a Comment