మాజీ లవర్ కు ప్రేమతో క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 3 August 2023

మాజీ లవర్ కు ప్రేమతో క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్ !


ధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన అంకిత తన మాజీ బాయ్ ఫ్రెండ్ కోసం జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమె ఆర్డర్ ను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింది. దీంతో అతను ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ఇలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు,  ఏకంగా మూడు సార్లు ఇలా అతనికి ఫుడ్ ఆర్డర్ పెట్టింది. దీంతో ఏకంగా జొమాటోనే జోక్యం చేసుకుంది. "భోపాల్‌కు చెందిన అంకితా దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై ఆహారం పంపడం ఆపివేయండి. ఇది మూఢవసారి, అతను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు" అని ట్వీట్‌ చేసింది. దాంతో పాటు "దయచేసి ఎవరైనా అంకితా ఖాతాలో క్యాష్ ఆన్ డెలివరీ బ్లాక్ చేయబడిందని చెప్పండి.  ఆమె 15 నిమిషాలకు ఒకసారి మళ్లీ ప్రయత్నిస్తోంది" అని రాసుకువచ్చింది. ఈ ట్వీట్స్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఈ విషయంపై పలు రకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. "అతను చెల్లించే వరకు పంపుతూ ఉండండి" అని అంకిత సమాధానం ఇవ్వడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఫుడ్-లవ్ స్టోరీ ట్వీట్‌లను చూసిన కొంతమంది.. "Hy @zomato.. ఈ అర్ధంలేని పనిని ఆపమని నేను ఆమెను ఒప్పిస్తాను" అంటూ చమత్కారమైన కామెంట్లు పెడుతున్నారు.

No comments:

Post a Comment