యోగీ ఆదిత్యనాథ్ కి రాఖీ పంపిన మహిళ సీమా హైదర్ !

Telugu Lo Computer
0


భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురైన పాకిస్తానీ మహిళ సీమా హైదర్ ఇప్పుడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ కు రాఖీలు పంపింది. ఏడేళ్ల లోపు వయసున్న తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా వీసా లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేయగా.. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ అనే వ్యక్తినీ జైలుకు పంపారు.పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా హైదర్... 2019-20లో ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ఆడుతున్నప్పుడు మీనాతో పరిచయం ఏర్పడిందని.. చివరికి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ముందు వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారని తేలింది. నేపాల్‌లోని ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం హిందూ మతంలోకి మారానని, మీనాను వివాహం చేసుకున్నానని పాకిస్తాన్ మహిళ సీమా పేర్కొన్నారు. హైదర్ తన నలుగురు పిల్లలతో సహా గ్రేటర్ నోయిడాలోని తన అత్తింట్లో ఉండటానికి అనుమతించాలని అభ్యర్థిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. హైదర్ తన కేసులో రాష్ట్రపతి నుండి మౌఖిక విచారణకు కూడా కోరారు.ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా నిలిచిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు ఆమె రాఖీ పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు రాఖీలు పంపి ఆమె సాయం కోరారు. అలాగే సీమా హైదర్ ఓ వీడియో సందేశం కూడా విడుదల చేసింది. ఇందులో సీమా హైదర్.. ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు యోగీ, ఇతర నేతల్ని రాఖీ పండుగ సందర్భంగా తాను పంపిన రాఖీలు కట్టుకోవాలని కోరారు. ప్రస్తుతం తన భాగస్వామి సచిన్ మీనాతో కలిసి నోయిడాలో నివసిస్తున్న సీమా.. రాఖీ పండుగ సెంటిమెంట్ తో రాజకీయ నేతల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)