ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 6 August 2023

ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన !


త్తరప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ జిల్లాలో అమానవీయ సంఘటన  వెలుగు చూసింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలురు చేత కొందరు దుర్మార్గుల బలవంతంగా మూత్రం తాగించారు. అనంతరం వారి జననాంగాల్లో కారం చల్లారు. పైగా దీన్నంతటినీ వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నెటిజెన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు బాలురను తమ అదుపులోకి తీసుకున్న నిందితులు.. మొదటగా వారి చేత బలవంతంగా మూత్రం తాగించారు. అనంతరం వారికి ఏదో గుర్తు తెలియని మందు వేసి వారి మలద్వారంలో పచ్చి మిరపకాయలు ఎక్కించారు. బాధితుల వయసు 10-15 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇక ఇద్దరు బాధితుల్ని నిందితులు తీవ్రంగా దుర్భాషలాడారు. వీడియోలోని పిల్లలలో ఒకరికి వారి చేతులను అదుపులో ఉంచుకుని ఇంజెక్షన్ ఇవ్వడం కూడా చూడవచ్చు. నిందితులు స్థానిక గూండాలుగా గుర్తించారు. పత్ర ఠాణా ప్రాంతంలోని కొంకటి చౌక్ ప్రాంతంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా వీడియో గురించి తెలుసుకున్న సిద్ధార్థనగర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. నిందితుల్ని పట్టుకుని తగిన అభియోగాలు నమోదు చేసినట్లు, దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment