విపక్ష నేతలు సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ఈడీ వస్తుంది !

Telugu Lo Computer
0


త్యంత వివాదాస్పదమైన 'ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు' రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023)ను లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్యే సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఈ బిల్లును దిగువ సభ గురువారం ఆమోదించింది. కాగా ఈ చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. విపక్ష నేతలు సైలెంట్‌గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ వస్తుందని ఆమె హెచ్చరించడం గమనార్హం. 'ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు'పై లోక్‌సభలో చర్చ జరుగుతుండగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ.. ''నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ  అధికారులు రావాల్సి ఉంటుంది'' అని ఆమె హెచ్చరించారు. అనంతరం ఈ బిల్లును సమర్థిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరోక్షంగా లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన 'పావు వంతు సీఎం' అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ''దిల్లీలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికే సగం అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల ఆయన (కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ) 1/4 వంతు ముఖ్యమంత్రే'' అని విమర్శించారు. మీనాక్షి లేఖి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని విపక్షాలు దుయ్యబట్టాయి. ''ఆవేశంలో మీనాక్షి లేఖి విపక్షాలను బెదిరించే ప్రయత్నం చేశారు. మేం చేసిన ఆరోపణలకు ఇదే సాక్ష్యం'' అని ఎన్సీపీ తెలిపింది. ఇక, ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ బీవీ స్పందిస్తూ.. ''ఇది హెచ్చరికనా? బెదిరింపా?'' అని కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంట్‌ వేదికగా ప్రతిపక్షాలను బెదిరించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని టీఎంసీ దుయ్యబట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)