జియో ప్రాథమిక రీఛార్జ్‌ రూ.119 ప్లాన్‌కు స్వస్తి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

జియో ప్రాథమిక రీఛార్జ్‌ రూ.119 ప్లాన్‌కు స్వస్తి !


జియో ప్రీపెయిడ్‌లో ఇప్పటి ప్రాథమిక రీఛార్జ్‌ ప్లాన్‌గా ఉన్న రూ.119 ప్లాన్‌ను నిలిపివేసింది. దీంతో జియో యూజర్లు ప్రాథమిక రీఛార్జ్‌ కోసం రూ.149తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో జియో ప్రీపెయిడ్‌లో రూ. 119 ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్‌గా ఉండేది. దీంతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు 14 రోజుల అపరిమిత కాలింగ్‌తోపాటు, రోజుకు 1.5 జీబీ డేటా, వంద మెస్సేజ్‌లు అందించేది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు దాని స్థానంలో రూ. 149 రీఛార్జ్ ప్లాన్‌లో 20 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ డేటాతోపాటు, 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తోంది. వీటికి అదనంగా జియో యూజర్లకు జియో సినిమా, జియో టీవీ యాప్‌లలో కార్యక్రమాలను వీక్షించవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటా మాత్రం ఉండదు. కొద్దిరోజుల క్రితం ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్లాన్‌ ధర రూ.1099గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ లభిస్తుంది. జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.1499. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ (బేసిక్‌) లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149 కాగా.. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.199 గా ఉంది.

No comments:

Post a Comment