సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొట్టి యువకుడు మృతి !


త్తరప్రదేశ్‌లోని మథురలో సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.  ఆదివారం రెండు బైక్‌లపై వచ్చిన ముగ్గురు స్నేహితులు ద్వారకా ధీష్‌ ఆలయాన్ని దర్శించారు. ఆ తర్వాత తివారిపురం వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జీ వద్దకు వెళ్లారు. తమ మొబైల్‌ ఫోన్లతో సెల్ఫీలు తీసుకోసాగారు. ఇంతలో ఒక రైలు ఆ బ్రిడ్జీ మీదుగా వస్తున్నది. గమనించిన ముగ్గురు యువకులు బ్రిడ్జీ చివరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, ఇద్దరు యువకులు తప్పించుకోగా ఒకరిని రైలు ఢీకొట్టింది. దీంతో గాల్లో ఎగిరిపడిన అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు, రైల్వే బ్రిడ్జీలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు. https://t.me/offerbazaramzon


No comments:

Post a Comment