తిరుమలలో బ్రేక్‌ దర్శనం పేరిట మోసం !

Telugu Lo Computer
0


వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) నకిలీ టికెట్లను భక్తుడికి అంటగట్టి మోసగించిన దళారుల ముఠాపై తిరుమల టూటౌన్‌ పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కామిశెట్టి వేణు శ్రీవారి దర్శనం కోసం దళారి అభిషేక్‌ను ఆశ్రయించాడు. అతను నాలుగు వీఐపీ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి వేణు వద్ద నుంచి రూ.11వేలు తీసుకున్నాడు. మరో దళారి శ్రీను ఫోన్‌ నంబరు ఇచ్చి అతన్ని సంప్రదించాలని సూచించాడు. భక్తుడు ఆయన్ని సంప్రదించగా అతడు ఎం.అశోక్‌ నాయక్‌ అనే మరో దళారి నంబరు ఇచ్చి అతన్ని సంప్రదించాలని కోరాడు. భక్తుడు అతని వద్దకు వెళ్లగా నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను ఇచ్చి, ఏటీసీ కూడలి నుంచి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ మీదుగా వెళితే అక్కడ టికెట్‌ స్కానింగ్‌ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌కు చెందిన శివనారాయణ ఉంటాడని అతను అన్నీ చూసుకుంటాడన్నారు. శివనారాయణ టికెట్లను స్కాన్‌ చేసినట్లు నటించి దర్శనానికి పంపించేశాడు. బ్రేక్‌ దర్శనం ఇప్పిస్తానని ప్రత్యేక దర్శనానికి పంపిస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన భక్తుడు తితిదే విజిలెన్స్‌ వింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు టికెట్లను తనిఖీ చేసి అవి ఎస్‌ఈడీ నకిలీవిగా గుర్తించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)