అమెరికాకు చైనా హెచ్చరిక ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

అమెరికాకు చైనా హెచ్చరిక !


తైవాన్‌కు అమెరికా మిలటరీ చేస్తున్న సాయం తమ ద్వీపాన్ని ఏకం చేసుకునే తమ ప్రయత్నాలను అడ్డుకోలేదని చెప్పింది. ”సామాన్యుల నుంచి వసూలు చేసిన పన్నులను తైవాన్ వేర్పాటువాద శక్తులు ఎంతగా ఖర్చు చేస్తున్నప్పటికీ, అమెరికా మిలటరీ ఎన్నో ఆయుధాలను పంపుతున్నప్పటికీ అవన్నీ మమ్మల్ని కదల్చలేవు. తైవాన్ సమస్యను పరిష్కరించడంలో మేము చేస్తున్న ప్రయత్నాలను చెడగొట్టలేవు. మా మాతృభూమిని పునరేకీకరణ చేయడంలో మాకు ఉన్న దృఢ సంకల్పాన్ని చెక్కుచెదర్చలేవు” అని చైనా పేర్కొంది. అమెరికా చర్యలన్నీ తైవాన్ ను ప్రమాదకరంగా, మందుగుండు సామగ్రి డిపోలా మార్చుతున్నాయని చెప్పింది. తైవాన్ జలసంధిలో యుద్ధం ముప్పును తీవ్రతరం చేసేలా ఉన్నాయని పేర్కొంది. చాలాకాలంగా తైవాన్ చుట్టూ చైనా మిలటరీ చర్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, తైవాన్ సమీపంలోకి చైనాకు చెందిన ఆరు యుద్ధ నౌకలు వెళ్లాయని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. తైవాన్ కు అమెరికా భారీగా మిలటరీ సాయం చేస్తోంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment