మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై పోలీసు షూతో దాడి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని రాజధాని లక్నోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్ధొయ్ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిపై స్థానిక పోలీసు విచక్షణా రహితంగా దాడి చేశాడు. సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసు మద్యం సేవించిన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోనే షూతో చెంప మీద కొట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా, పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీడియో ప్రకారం పోలీసు మార్కెట్ ప్రదేశంలోకి సివిల్ డ్రెస్‌లో వచ్చిప్పుడు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కనిపించాడు. బాధితునిపై పోలీసు షూతో దాడి చేశాడు. కేవలం 4 నిమిషాల వ్యవధిలో షూతో ముఖంపై 38 దెబ్బలు కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు బాధితుడు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పారు. బాధిత వ్యక్తిపై దాడి చేసిన సదరు పోలీసుని విధుల నుంచి తప్పించారు. ప్రజలతో గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి స్థానికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణంగానే తాను కొట్టాల్సి వచ్చిందని సస్పెన్ష్‌కు గురైన పోలీసు చెప్పారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)