మిజోరం బీజేపీ ఉపాధ్యక్షుడి రాజీనామా !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో చర్చిల కూల్చివేతకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిచ్చాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు. క్రైస్తవుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, అందుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. మణిపూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లను ఆయన ప్రస్తావించారు. 357 చర్చిలు, పాస్టర్‌ క్వార్టర్లు, మత సంస్థలకు చెందిన భవనాలను మీతీ మిలిటెంట్లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మణిపూర్ సీఎం కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కానీ ఈ దాడులను ఖండించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ ఏడాది చివరిలో మణిపూర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వనరాంచువాంగ బీజేపీని వీడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మణిపూర్‌లో మీతీ, కుకీ తెగల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో సుమారు 150 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)