హిమాచల్‌కు రెండో విడత రూ. 180 కోట్ల సాయం

Telugu Lo Computer
0


రదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ కి కేటాయించారు. వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశం తో కేంద్రం హిమాచల్ ఎస్‌డిఆర్‌ఎఫ్‌కి 2023 24 సంవత్సరంలో విడుదల చేయాల్సిన సహాయ నిధిని ముందుగా విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే జులై 10న మొదటి విడతగా రూ. 180. 40 కోట్లను విడుదల చేసింది. రెండోవిడతలో మరో రూ. 180. 40 కోట్లను విడుదల చేసేందుకు మంత్రి ఆమోదం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలకు వరదలు తీవ్రంగా సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రాన్ని ఆదుకోడానికి కేంద్రం ముందుకొచ్చింది. ఎన్డీర్‌ఎఫ్ బలగాలతోపాటు బాధితులను తరలించడానికి ఒక 1 పారా ఎస్‌ఎఫ్‌తోపాటు 205 ఆర్మీ ఏవియేషన్ స్కాడ్రన్లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వీటిలో రెండు ఎం117 వి 5 హెలికాప్టర్లను బాధితులకు తరలించేందుకు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలను పరిశీలించడానికి కేంద్రం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందాలు జులై 17న క్షేత్ర సందర్శనను ప్రారంభించనున్నాయి. ఇదిలా ఉండగా కుండపోత వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో 88 మంది మృతి చెందారు. 100 మంది గాయపడ్డారు. 16 మంది గల్లంతయ్యారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)