విజయవాడ కోర్టులో పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు అయ్యింది. వాలంటీర్ ఇచ్చిన కేసును న్యాయమూర్తి స్వీకరించారు. తమపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురయ్యానని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్స్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507, 511 ఆఫ్ ఐపీసీ ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)