కష్టాల కడలిలో పాకిస్థాన్‌ అంతర్జాతీయ విమానయాన సంస్థ !

Telugu Lo Computer
0


పాకిస్థాన్‌ అంతర్జాతీయ విమానయాన సంస్థ విదేశీ సర్వీసులు నడిపేందుకు అవసరమైన ఒక్క రోజు నావిగేషన్‌ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే ఈ సంస్థపై 60,000 కోట్ల పాకిస్థానీ రూపాయల రుణ భారం ఉంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ వార్తాసంస్థ పేర్కొంది. ''ప్రస్తుతం పీఐఏ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇది సౌదీకి చెల్లించాల్సిన 50 మిలియన్‌ డాలర్లు కూడా చెల్లించలేకపోతోంది. అందుకే ఒక దశలో ఈ విమానయాన సంస్థ సేవలను నిలిపి వేయాల్సి వచ్చింది. నష్టాల్లో పాక్‌ అంతర్జాతీయ విమాన పరిశ్రమ మరెంతో కాలం కొనసాగటం కష్టమని.. ప్రభుత్వం నుంచి నిధులు అందడం ఆగిపోయిన మర్నాడే సంస్థ మూతపడుతుందని కొందరు కీలక అధికారులు వ్యాఖ్యానించారు. తొలుత పీఐఏలో ఉన్న నష్టాలకు అడ్డుకట్ట వేసి.. ఆ తర్వాత పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు క్రమంగా ప్రధాన కార్యకలాపాలను ప్రైవేటీకరించాలని వారు చెబుతున్నారు. ప్రస్తుతం బోయింగ్‌-777ను లీజుకు తీసుకొని విమానాల సంఖ్యను 11 పెంచుకోవాలని పీఐఏ ఎప్పటి నుంచో భావిస్తోంది. కానీ, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని చూస్తే.. కంపెనీని పునర్‌ వ్యవస్థీకరించి మూడు లేదా నాలుగు సంస్థలుగా విభజించడం మినహా మరో మార్గం లేదని పాక్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇటీవలే పాక్‌ ఆర్థిక మంత్రితో పీఐఏ యాజమాన్యం భేటీ నిర్వహించిది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని మలేసియా అధికారులు కొన్ని నెలల క్రితం సీజ్‌ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో ఈ విమానాన్ని కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకొన్నారు. అప్పట్లో ఈ ఘటన పాక్‌ను ఇబ్బందికి గురి చేసింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)