మీ శాంతి ప్రతిపాదనలను పరిశీలిస్తా ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 29 July 2023

మీ శాంతి ప్రతిపాదనలను పరిశీలిస్తా !


క్రెయిన్‌తో యుద్ధం ముగిసేందుకు ఆఫ్రికా దేశాలు చేసిన శాంతి ప్రతిపాదనలను పరిశీలిస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హామీ ఇచ్చారు. అయితే శాంతి నెలకొనాలంటే ఉక్రెయిన్‌తో కూడా మాట్లాడాలని వాటికి సూచించారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన రష్యా-ఆఫ్రికా సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడారు. అమెరికా సారథ్యంలోని నాటో కూటమికి పోటీగా ఆఫ్రికా దేశాలను మచ్చిక చేసుకోవటానికి వ్యూహాత్మకంగా పుతిన్‌ ఈ సదస్సును ఏర్పాటు చేశారు. గతంలో 43 దేశాలు హాజరుకాగా, ఈసారి అందులో సగమే వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆఫ్రికా దేశాలూ ఇబ్బంది పడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌లలోని ధాన్యంపైనే అనేక ఆఫ్రికా దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌తో ధాన్యం ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది.  ఉక్రెయిన్‌ నుంచి ఇకమీదట ధాన్యం బయటకు రావటం కష్టం. అది ఆఫ్రికా దేశాలకు దెబ్బ. అందుకే తాజా సదస్సులో పుతిన్‌ ఆ దేశాలకు భరోసా ఇచ్చారు. పేద ఆఫ్రికా దేశాలకు రష్యా ఉచితంగా ధాన్యం ఎగుమతి చేస్తుందని ప్రకటించారు. ''ఆహార సరఫరా విషయంలో రష్యా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది. మీ ఆహార భద్రతకు ఎలాంటి ముప్పు రాకుండా మేం సహాయం చేస్తాం. భయపడాల్సిన అవసరం లేదు'' అని పుతిన్‌ హామీ ఇచ్చారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment