ఉక్రెయిన్‌కు చేరిన వినాశకర క్లస్టర్‌ ఆయుధాలు

Telugu Lo Computer
0


యుద్ధ భూమిలో అతి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్‌ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరాయి. ఈ విషయాన్ని గురువారం పెంటగాన్‌ ధృవీకరించింది. రష్యా దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను కీవ్‌కు సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది. దీనిపై గత వారం జోబైడెన్‌ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలల ముందే అమెరికా అధికారులు వీటి సరఫరాపై మల్లగుల్లాలు పడ్డారు. సాధారణంగా క్లస్టర్‌ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి. వాటి లోపల ఉన్న చిన్న బాంబులెట్స్‌ (బాంబులు) ఆ ప్రాంతం మొత్తం వెదజల్లుతాయి. వీటిల్లో కొన్ని పేలని వాటి శాతాన్ని డడ్‌రేట్‌గా పేర్కొంటారు. ఇవి అలానే ఉండిపోయి  యుద్ధం ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో జనసంచారం పెరిగిన సమయంలో పేలి ప్రమాదాలకు కారణం అవుతాయి. తాజాగా అమెరికా సరఫరా చేసే క్లస్టర్‌ ఆయుధాల్లో డడ్‌రేట్‌ను గణనీయంగా తగ్గించామని అమెరికా చెబుతోంది. వేల సంఖ్యలో తాము వీటిని ఉక్రెయిన్‌కు ఇస్తామని పెంటగాన్‌ చెబుతున్నా.. కచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. అమెరికా చివరిసారిగా వీటిని 2003లో ఇరాక్‌ యుద్ధంలో ఉపయోగించింది. తర్వాతి నుంచి వాటి వినియోగాన్ని ఆపేసింది. అప్పటి నుంచి అమెరికాలో భారీస్థాయిలో ఈ క్లస్టర్‌ ఆయుధాలు పేరుకుపోయాయి. ఇవి దాదాపు 30 లక్షల దాకా ఉన్నట్లు సమాచారం. వాటన్నింటినీ ఇప్పుడు ఉక్రెయిన్‌కు సరఫరా చేయటం ద్వారా అమెరికా వదిలించుకోబోతోంది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)