సోదరి తలను చేతితో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన సోదరుడు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్వారా గ్రామంలో తన సోదరిని అతి దారుణంగా హత్య చేసి, తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అది చూసిన స్థానికులు  వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించగా, దారిలో పోలీసుల కంటబడ్డాడు. దీంతో ఆ యువకుడు  తాను లొంగిపోయేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు రియాజ్ అనే వ్యక్తి తన సోదరి ఆషిఫాతో ఏదో విషయమై వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రియాజ్ ఇంట్లోని కత్తితో ఆషిఫా తల నరికాడు. ఆ తర్వాత రియాజ్ ఆ తలను తీసుకుని ధైర్యంగా రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపై సుమారు కిలోమీటరు మేర అందరూ చూస్తుండగానే నడుచుకుంటూ వెళ్లాడు. అయితే అతన్ని చూసిన జనాలు అతడిని పట్టుకునేందుకు సాహసించలేదు. అయితే గ్రామానికి చెందిన చాంద్‌బాబు అనే వ్యక్తితో ఆషిఫాకు అక్రమ సంబంధం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. చాంద్ బాబును పెళ్లి చేసుకోవద్దని ఆషిఫాకు రియాజ్ పదే పదే చెప్పాడు.. అయినా ఆమే వినలేదు. దీంతో కోపాద్రిక్తుడైన రియాజ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)