స్టువర్ట్‌ బ్రాడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమణ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 30 July 2023

స్టువర్ట్‌ బ్రాడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమణ !


ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ స్టువర్డ్‌ బ్రాడ్‌ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని బ్రాడ్‌ వెల్లడించాడు. యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్‌ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్‌లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్‌ బ్రాడ్‌. తన సహచర పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్‌ అర్థంతరంగా రిటైర్మెంట్‌ ఇవ్వడం అభిమానులకు షాక్‌ కలిగించింది. ఇక స్టువర్ట్‌ బ్రాడ్‌ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్‌ సింగ్‌. 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్‌ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్‌లో యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్‌ కోపం ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు శాపంగా మారింది. ఓవరాల్‌గా స్టువర్ట్‌ బ్రాడ్‌ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్‌ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్‌ను సెమీస్‌ చేర్చడంలో బ్రాడ్‌ విఫలమయ్యాడు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment