ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే యోచన లేదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 28 July 2023

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే యోచన లేదు !


ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులు తమ పార్టీని ఫిరాయించకుండా నిరోధించేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో నిబంధనలు పొందుపరిచారు. పదో షెడ్యూల్‌ని కానీ, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కానీ సవరించే యోచన లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. చట్ట సవరణపై లోక్‌సభ స్పీకర్‌ గత జూలైలో నిర్వహించిన ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపారు. చట్టాన్ని అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సభ్యుల్లో రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభాపతికి మరిన్ని అధికారాలు కల్పించాలని మెజార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షుడికి అధికారం కల్పించాలని మరికొంత మంది సభ్యులు సూచించారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment