ఢిల్లీ వాసులను అవమానించొద్దు !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్థానికంగా ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు తాజా వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రజలు  ఉచితాలకు అలవాటు పడ్డారంటూ ఎల్‌జీ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. కష్టజీవులైన ఢిల్లీ ప్రజలను అవమానించొద్దని పేర్కొన్నారు. విద్య, వైద్యం, విద్యుత్‌, రవాణా తదితర రంగాల్లో ఆప్‌ ప్రభుత్వం ఆయా పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎల్‌జీ ప్రసంగిస్తూ ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఉచితాలకు అలవాటు పడ్డారని వ్యాఖ్యానించారు. ఇది కాస్త వివాదాస్పదమయ్యింది. ఆప్‌ నేతలు ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వీకే సక్సేనా బయటి వ్యక్తి అని, ఆయన ఢిల్లీ  ప్రజలను అర్థం చేసుకోలేదని సీఎం కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. 'ఢిల్లీ ప్రజలు కష్టజీవులు. తమ శ్రమతో వారు ఈ నగరాన్ని తీర్చిదిద్దారు. ఎల్జీ సర్‌.. మీరు బయటి నుంచి వచ్చారు. ఢిల్లీ గురించి, ఢిల్లీ వాసులు గురించి మీకు తెలియదు. స్థానికులను ఇలా అవమానించవద్దు' అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీ  ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల మాదిరి చోరీలు చేయడం లేదని, డబ్బు ఆదా చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఈ విషయంలో మీ సమస్య ఏంటి? అని ఎల్‌జీని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)