దేశీ వంటకాలను ఆస్వాదిస్తున్న మోనాలిసా !

Telugu Lo Computer
0


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మనం ఊహించనివి ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో కొలువులు కోల్పోతామని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఈ టెక్నాలజీతో అందివచ్చే ప్రయోజనాలను మరికొందరు ఆస్వాదిస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీతో ముంచుకొచ్చే ముప్పు సంగతి ఎలా ఉన్నా పలు ఏఐ ఆధారిత ఇమేజ్‌లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్లు వృద్ధులైతే ఎలా ఉంటారనేది వెల్లడించిన ఏఐ ఇమేజ్‌లు ఇటీవల నెట్టింట సందడి చేయగా సినీ స్టార్లు హీరోయిన్‌లైతే ఎలా ఉంటారో ఊహించే ఏఐ ఇమేజ్‌లు సైతం ఇంటర్‌నెట్‌లో తెగ వైరలయ్యాయి. తాజాగా సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా ఏఐ టూల్స్‌ను ఉపయోగించి రూపొందించిన ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో మోనాలిసా భారత వంటకాలను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ ఫొటోను వికాస్ ఖన్నా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమె ముందున్న టేబుల్‌లపై భారతీయ వంటకాలు నోరూరిస్తూ కనిపించాయి. ఓకే నేను ఏఐని ఉపయోగిస్తూ రూపొందించా, ఇండియన్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న మోనాలిసా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. అద్భుతమంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, భారత వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి…మోనాలిసా కూడా దేశీ ఫుడ్‌ను ఇష్టపడి ఉంటుందని అనుకుంటున్నానని మరొక యూజర్ రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)