వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్న టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్, భెల్‌ కన్సార్షియం

Telugu Lo Computer
0


వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్టును టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) కన్సార్షియం దక్కించుకుంది. తద్వారా మొత్తం 80 స్లీపర్‌ ట్రైయిన్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటిని 2029కల్లా అందించవలసి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో టిటాగఢ్, భెల్‌ తెలియజేశాయి. మొత్తం కాంట్రాక్టు విలువను ర. 24,000 కోట్లుగా వెల్లడించాయి. దేశీ సంస్థల కన్సార్షియంకు ఈ స్థాయి విలువలో రైల్వే శాఖ కాంట్రాక్టునివ్వడం ఇదే తొలిసారి కాగా, వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల డిజైన్, తయారీతోపాటు.. 35 ఏళ్లపాటు నిర్వహణను చేపట్టనున్నాయి. టెండర్‌ విధానంలో ఏకైక ఆత్మనిర్భర్‌ కన్సార్షియంగా టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్, బీహెచ్‌ఈఎల్‌ కన్సార్షియం నిలిచింది. రెండేళ్లలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ కాంట్రాక్టును ఆరేళ్లలో పూర్తి చేయవలసి ఉన్నట్లు టిటాగఢ్‌ రైల్‌ వైస్‌చైర్మన్, ఎండీ ఉమేష్‌ చౌధరీ తెలియజేశారు. తొలి ప్రొటోటైప్‌ రైలును రెండేళ్లలోగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి మిగిలిన రైళ్లను అందించనున్నట్లు వివరించారు. ప్రతీ రైలుకు 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా సువరు 887 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్‌ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచి్చన మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రైళ్ల తయారీలో చివరి దశ అసెంబ్లీ, పరిశీలన, నిర్వహణ వంటివి చెన్నైలోని దేశీ రైల్వే ప్లాంటులో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)