బీఎస్ఎన్ఎల్ కు మూడో పున:రుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర !

Telugu Lo Computer
0


ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం సెంట్రల్ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ పెట్టుబడి ద్వారా 4జీ, 5జీ స్పెక్ట్రంను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించింది. అదనపు ఈక్విటీ పెట్టుబడికి అనుగుణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధీకృత మూలధనాన్ని రూ. 1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెంచనున్నారు. కేటాయించిన స్పెక్ట్రంతో బీఎస్‌ఎన్‌ఎల్‌లో దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సర్వీసులను ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పటి వరకు కవరేజి లేని ప్రాంతాలకు 4జీ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ను తీసుకెళుతుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్‌లను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అలాగే క్యాప్టివ్‌ నాన్‌-పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం సర్వీసులు/స్పెక్ట్రంను భారత్ సంచార్ నిగమ్ లిమిటెట్ ఇస్తుంది. 2019లో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు కేంద్రం రూ. 69,000 కోట్ల తొలి పునరుద్ధరణ ప్యాకేజీని అందించింది. 2022లో రూ.1.64 లక్షల కోట్ల విలువైన రెండో ప్యాకేజీని ఇచ్చింది. బీఎస్ఎల్ ధన ఖర్చులకు, గ్రామీణ ప్రాంతాల మూలాధార ల్యాండ్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫాండింగ్‌, బ్యాలెన్స్‌ షీట్‌ మెరుగుపర్చడానికి ఆర్థిక మద్దతుతో పాటు ఏజీఆర్‌ బకాయిల సెటిల్‌మెంట్‌ చేసింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌తో బీబీఎన్‌ఎల్‌ విలీనం తదితర కార్యకలాపాలకు గత రెండు ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం అందించింది. దాని తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ రుణభారం రూ. 32,944 కోట్ల నుంచి రూ. 22,289 కోట్లకు తగ్గింది.

Post a Comment

0Comments

Post a Comment (0)